ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడులపై ప్రభుత్వం ప్ర త్యేక దృష్టి సారించింది. ఇటీవల విడుదలైన పలు సర్వేల్లో విద్యాప్రమాణాలు తగ్గిపోతున్నట్లు తేలడంతో ఫోకస్ పెట్టింది. ప్రైవేట్, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరగడం, ప్రభుత్వ యాజ మాన్య పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గడంతో చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పాఠశాలల్లోని వాస్త వ పరిస్థితులను తెలుసుకునేందుకు రాష్ట్ర వి ద్యాపరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్టీ) బృందాలను పంపుతోంది.
జిల్లాకు డాక్టర్ ఎల్లయ్య, స్టాలిన్‌బాబును నియమించింది. వారానికి రెండురోజుల పాటు వీ రు జిల్లాలో పర్యటించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. దీంతో సర్కారు బడుల్లో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల సామర్థ్యాలు, ఉపాధ్యాయుల పనితీరు తేటతెల్లం కానుంది. ఇప్పటి కే మంచిర్యా ల జిల్లా లో ఎస్‌సీ ఈఆర్టీ బృందం తనిఖీలు చేపడుతోంది. త్వర లో ఆదిలాబాద్ జిల్లాలోనూ తనిఖీలు చేపట్టనున్నారు.
సర్కారుకు తనిఖీ నివేదికలు
జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలను ఎస్‌సీఈఆర్టీ బృందం సభ్యులు డాక్టర్ ఎల్లయ్య, స్టాలిన్ బాబు తనిఖీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 పాఠశాలలను తనిఖీ చేయనుండగా, ఆదిలాబాద్ జిల్లాలో 30 స్కూళ్లను తనిఖీ చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో 477 ప్రాథమిక పాఠశాలలు, 112 ప్రాథమికోన్నత పాఠశాలలు, 120 ఉన్నత పాఠశాలలున్నాయి. 18 కేజీబీవీలు, ఆరు మోడల్ స్కూళ్లతోపాటు యూఆర్‌ఎస్ పాఠశాల ఉంది. ఈ పాఠశాలల్లో 65వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఎస్‌సీఈఆర్టీ బృందం ప్రస్తుతం పాఠశాలల్లో అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్, సిలబస్, ల్యాబ్‌ల నిర్వహణ, అంతర్గత మూ ల్యాంకన విధానం, విద్యార్థుల సామర్థ్యాలు, బో ధన తీరు, మౌలిక వసతులపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
జిల్లాలోని పాఠశాలల సమాచారం
ప్రాథమిక పాఠశాలలు 477
ప్రాథమికోన్నత పాఠశాలలు 112
ఉన్నత పాఠశాలలు 120
కస్తూర్బా పాఠశాలలు 18
ఆదర్శ పాఠశాలలు 6
యూఆర్‌ఎస్ పాఠశాలలు 1
Comments
Please login to add a commentAdd a comment