‘పది’ పరీక్షలు ప్రారంభం
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు పరీక్షకు 10,022 మంది విద్యార్థులు హాజరు కాగా, 32 మంది గైర్హాజరైనట్లు డీఈవో ప్రణిత తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 10,043 మందికి 10,013 మంది హాజరు కాగా, 30 మంది గైర్హాజరయ్యారు. 99.70 శాతం హాజరు నమోదైంది. ప్రైవేట్ విద్యార్థులు 13 మందికి గాను 9 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. 81.82 శాతం హాజరు నమోదైంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులను సిబ్బంది క్షుణ్ణంగా పరిశీ లించి లోనికి అనుమతించారు. అవాంఛనీయ ఘట నలు చోటు చేసుకోకుండా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజర్షిషా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల, గజిటెడ్–1 పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ప లు కేంద్రాలను పరిశీలించి బందోబస్తులో ఉన్న సి బ్బందికి సూచనలు చేశారు. డీఈవో ప్రణిత, స్క్వా డ్‌లు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయగా మొదటిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
● కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment