మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
ఆదిలాబాద్‌రూరల్: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఏర్పా టు చేసే ఇఫ్తార్ ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జి ల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాంతి, సోదరభావాన్ని సూచించే రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కె.రాజలింగు, తహసీల్దార్ శ్రీనివాస్, ముస్లింలు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
కై లాస్‌నగర్: పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు బుధవారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి కోరారు. క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి నీటి ఎద్దడి మొదలైందన్నారు. ఏప్రిల్, మే లో తీవ్రరూపం దాల్చే అవకాశమున్నందున ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. లాండసాంగ్వి పంపుహౌస్ వద్ద రెండు చెక్ డ్యాంలు నిర్మించడంతో పాటు మావల చెరువు వద్ద మట్టి పూడికతీత పనులు చేపట్టాలన్నారు. పట్టణంలోని కాలనీలకు నీటిని సరఫరా చేసేందుకు గాను మరో 10 ట్యాంకర్లు కొనుగోలు చేయాలని కోరారు. అలాగే నిర్మల్ నుంచి వచ్చే మిషన్ భగీరథ నీరు నిరంతరంగా వచ్చేట్లు చూడాలని విన్నివించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ చెక్‌డ్యాంల నిర్మాణాలకు అవసరమైన ఎస్టిమేషన్ రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బోర్ల ఏర్పాటుతో పాటు, మరో ఐదు ట్యాంకర్లు మున్సిపల్ ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా వారు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజాని , కలాల శ్రీనివాస్, బండారి సతీష్, సంద నర్సింగ్, ఆవుల వెంకన్న, దర్శనాల లక్ష్మణ్, ఇజ్జగిరి సంజయ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment