మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి
చింతపల్లి: వేసవి దృష్ట్యా చింతపల్లిలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఆదేశించారు. బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు.అనంతరం సచివాలయం–1,చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం,జిల్లా పరిషత్ అతిథి గృహంతో పాటు మండల కేంద్రంలో ఉన్న గూనలంక,సాయినగర్ మంచినీటి పథకాలను పరిశీలించారు.రోజువారీ నీటి అవసరాలు తదితర వివరాలను ఎంపీడీవో శ్రీనివాసరావు,మంచినీటి సరఫరా విభాగం డీఈ కరుణలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.సచివాలయాల్లో సర్వే కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు.చెత్తనుంచి సంపద తయారు చేసే కేంద్రాల ద్వారా ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకోలన్నారు. మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని వినియోగంలోనికి తీసుకువచ్చేందుకు త్వరలోనే రూ.20 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు రవికుమార్,పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జెడ్పీ సీఈవో నారాయణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment