మహోగ్రంగా.. | - | Sakshi
Sakshi News home page

మహోగ్రంగా..

Published Thu, Mar 13 2025 11:56 AM | Last Updated on Thu, Mar 13 2025 11:52 AM

మహోగ్

మహోగ్రంగా..

మండుటెండలో

గర్జించిన యువత

కదంతొక్కిన నిరుద్యోగులు, విద్యార్థులు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో‘యువత పోరు’ విజయవంతం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్‌

డిమాండ్లపై జేసీ అభిషేక్‌ గౌడకు వినతిపత్రం

పాడేరులో ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం,జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, ఇతర నాయకులు

సాక్షి, పాడేరు: కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్‌తో పాటు అనేక అబద్ధపు హామీలిచ్చి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. యువతపోరు కార్యక్రమంలో భాగంగా బుధవారం పాడేరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పాతబస్టాండ్‌,సినిమాహల్‌ సెంటర్‌,తలారిసింగి మీదుగా కలెక్టరేట్‌ వరకు రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు.అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,జెడ్పీచైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర,ఎస్టీసెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణతో పాటు అన్ని మండలాల జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచ్‌లు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఇతర నేతలు మండుటెండను సహితం లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వ అవలంభిస్తున్న విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించారు.నిరుద్యోగ భృతి చెల్లించాలని,విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతిదీవెన వెంటనే అమలుజేయాలన్న నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. అనుమతులు లేవంటూ ఈ సందర్భంగా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ కూటమి నాయకులు నిరుద్యోగ భృతి,ఇంటికో ఉద్యోగమంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని,ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలుజేయకపోవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలపై వైఎస్సార్‌సీపీ పోరాటాలు ఉధృతం చేస్తుందని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వెంటనే హామీలు అమలుజేయాలని,విద్యార్థులు,నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యకు అప్పటి సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు.విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను సమర్థంగా అమలుజేసి, వారి ఉన్నత చదువులకు ఎంతో కృషి చేశారన్నారు.

పోరాటాలు తప్పవు: ఎమ్మెల్యే మత్స్యలింగం

కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలు,మోసాలపై వైఎస్సార్‌సీపీ పోరాటాలు ఉధృతం చేస్తుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. విద్యాదీవెన,వసతిదీవెన, నిరుద్యోగ భృతి వెంటనే అమలుచేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదన్నారు.

ప్రజలకు తీరని అన్యాయం : జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

కూటమి ప్రభుత్వ తొమ్మిది నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు,నిరుద్యోగులు,రైతులు,మహిళలకు ఇచ్చిన హామీలన్నీ పక్కనబెట్టి నిరంకుశంగా పాలిస్తోందన్నారు. హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు తప్పవని,భవిష్యత్తులో కలెక్టరేట్‌ల వద్ద దీక్షలు చేస్తామని ఆమె హెచ్చరించారు.

దారుణమైన పాలన: మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

కూటమి ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్‌ అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల భృతి,ఇంటికో ఉద్యోగం పేరిట కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.విద్యార్థులకు ఫీజులు,ఉపకారవేతనాల చెల్లింపుల్లోను అన్యాయం చేస్తోందని తెలిపారు.

హామీలునెరవేర్చాలి: మాజీ ఎమ్మెల్యే పాల్గుణ

కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హమీలను వెంటనే నెరవేర్చాలని అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ డిమాండ్‌ చేశారు.గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు ఉద్యోగ,ఉపాఽధి అవకాశాలను కల్పించాలని,విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

జేసీ అభిషేక్‌గౌడకు వైఎస్సార్‌సీపీ నేతల వినతి

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,ఉద్యోగాలు కల్పన,విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌,వసతిదీవెన చెల్లించాలన్న తదితర డిమాండ్లతో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అభిషేక్‌గౌడకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నేతలు వినతిపత్రం అందజేశారు. డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల ఎంపీపీలు అనూషాదేవి,శెట్టి నీలవేణి,బాకా ఈశ్వరి,బోయిన కుమారి, జెడ్పీటీసీలు పోతురాజు బాలయ్యపడాల్‌,కిముడు శివరత్నం,కూడా బొంజుబాబు,చటారి జానకమ్మ, వైస్‌ ఎంపీపీలు కుంతూ రు కనాకలమ్మ,కుడుముల సత్యనారాయణ,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర,జిల్లా పార్టీ నేతలు బత్తిరి రవిప్రసాద్‌,గండేరు చినసత్యం, కిల్లు కోటిబాబునాయుడు, కూడా సురేష్‌కుమార్‌,సీదరి మంగ్లన్నదొర,జల్లి సుధాకర్‌,జల్లి హలియారాణి,తెడబారికి సురేష్‌కుమార్‌,గబ్బాడి శేఖర్‌,తిమోతి,సీదరి రాంబాబు, మత్స్యకొండంనాయుడు,కురుసా పార్వతమ్మ,గిడ్డి విజయలక్ష్మి,ఉర్వశిరాణి,శరభ సూర్యనారాయణ,పాంగి చిన్నారావు, చంద్రుబాబు,లకే రామసత్యవతి,కోడా సుశీల,గల్లోంగి లక్ష్మికొండమ్మ,గిరి, అప్పారావు,పాంగి గుణబాబు,బసవన్నదొర,కొట్టగుళ్లి నాగేంద్రకుమార్‌, శెట్టి అప్పాలు, డి.పి.రాంబాబాబు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు,సర్పంచ్‌లు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై యువత గర్జించింది. వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువత పోరు’లో కదంతొక్కింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పాడేరుకు చేరుకుని కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించింది. యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా నిరసనలో పాల్గొనడంతో పట్టణం హోరెత్తిందింది.

చంద్రబాబు అంటేనే మోసం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమ లు చేయకుండా చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు అంటనే మోసానికి పర్యాయపదంగా మారారు. మా పిల్లల ఫీజులు కట్టలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వం విద్యార్థులకు ఎంతో సాయం చేసింది. మాలాంటి నిరుపేదలకు జగనన్నతోనే మంచి జరుగుతుంది. – పడ శెట్టి అప్పన్న, బొర్రిగుడ,మాడదల పంచాయతీ, అరకులోయ మండలం

బూటకపు హామీలతో దగా

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదు. ఎన్నికల సమయంలో అమలుకాని హామీలిచ్చి కూటమి నేతలు దగా చేశారు. ప్రజా ప్రభుత్వం అంటే జగనన్న ప్రభుత్వంలా ఉండాలి. జగనన్న ప్రభుత్వమే మళ్లీ రావాలి. – సీహెచ్‌.మహేష్‌,

విద్యార్థి తండ్రి, లివిటి గ్రామం,

రాప పంచాయతీ, హుకుంపేట మండలం

కూటమి నేతలు మోసం చేశారు

కూటమి నేతలు అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి, తరువాత మోసం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోవడం లేదు.

– ఎల్‌.దేముడు, వసవడ గ్రామం,

సుంకడ పంచాయతీ, జీకే వీధి మండలం

బుద్ధి చెప్పాలి

కూటమి ప్రభుత్వం ఏర్పడి 9నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక అవస్థలు పడుతున్నాం. బూటకపు హామీలిచ్చిన కూటమి నేతలకు ప్రజలంతా కలిసి బుద్ధి చెప్పాలి.

– వి. సీతారాంనాయుడు,

వంజరి గ్రామం,జిమాడుగుల మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
మహోగ్రంగా..1
1/7

మహోగ్రంగా..

మహోగ్రంగా..2
2/7

మహోగ్రంగా..

మహోగ్రంగా..3
3/7

మహోగ్రంగా..

మహోగ్రంగా..4
4/7

మహోగ్రంగా..

మహోగ్రంగా..5
5/7

మహోగ్రంగా..

మహోగ్రంగా..6
6/7

మహోగ్రంగా..

మహోగ్రంగా..7
7/7

మహోగ్రంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement