ఆ దుశ్చర్య మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పనే
నిర్ధారించిన పోలీసులు
గూడెంకొత్తవీధి: మండల కేంద్రం గూడెంకొత్తవీధిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి చెప్పులు, గాజులు, ఖాళీ మద్యం సీసాలు కట్టిన వ్యవహారంపై విచారణ జరిపి, స్థానిక సామాజిక భవనం వద్ద కొద్దికాలంగా ఉంటున్న మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పనిగా గుర్తించినట్టు ఎస్‌ఐ అప్పలసూరి తెలిపారు. వినాయకుని ఆలయానికి సమీపంలో ఉన్న వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముసుగు వేశారు. ముసుగును తొలగించకపోగా మంగళవారం విగ్రహం చేతికి ఖాళీ మద్యం సీసాలు ఉండడాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు గమనించారు. దీంతో దామనాపల్లి సర్పంచ్‌రామకృష్ణ పోలీసులకు సమాచారం అందించారు. ఈఘటన పై ‘సాక్షి’లో దుశ్చర్యపై ఆగ్రహం శీర్షికతో వార్త ప్రచురితం కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. కొద్దిరోజులుగా విగ్రహం పరిసరాల్లోనూ తిరుగాడుతున్న మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పనిగా గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. ఈవిషయంలో ఎటువంటి అనుమానాలకూ తావు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment