నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు
ఎటపాక: మండల పరిధిలోని వెంకటరెడ్డిపేట గ్రామంలో వేంచేసియున్న అలమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 13 వతేదీ నుంచి తిరు కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను వీక్షించేందుకు మండల ప్రజలతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఎటపాక సీఐ కన్నపరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13న స్వామి వారి కల్యాణమహోత్సవానికి అంకురార్పణ జరుగుతుంది.14వ తేదీ ఉదయం స్వామి వారికి అభిషేకం, హోమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2గంటల వరకు తిరుకల్యాణ మహోత్సవాన్ని భద్రాద్రి ఆలయ అర్చకులచే నిర్వహించనున్నారు. 15న స్వామివారికి పూర్ణాహుతి, చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి.
వెంకటరెడ్డిపేటలో ముస్తాబైన
వేంకటేశ్వరస్వామి ఆలయం
Comments
Please login to add a commentAdd a comment