ఇళ్ల స్థలాల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ
రంపచోడవరం: ఏజెన్సీలోని నిరుపేద గిరిజన మహిళలకు ఇళ్ల స్థలాల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఐటీడీఏ సమావేశం హాలులో బుధవారం సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీలు తహసీల్దార్‌లతో సమీక్ష నిర్వహించారు. పీవో మాట్లాడుతూ దరఖాస్తులు నింపిన తరువాత మండల అధికారులు యాప్‌లో అప్‌లోడ్ చేసి, కలెక్టర్ అనుమతి కోసం పంపాలన్నారు. మూడు సెంట్ల స్థలం మంజూరు చేయనున్నట్టు చెప్పారు. నేషనల్ హైవే 516కు సంబంధించిన బాధితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. మారేడుమిల్లి పరిసరాల ప్రాంతాల్లో అనుమతులు లేకుండా రిసార్ట్స్ ఏర్పాటు చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ భూముల మ్యుటేషన్లపై ఆరా తీశారు.పోషణ్‌అభియాన్ పథకం అమలు కోసం పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు వేర్వేరుగా సర్వే చేసి వాటి జాబితా సమర్పించాలని ఆదేశించారు. 141 గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వం భూముల జాబితా సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో లక్ష్మీరమణి, తహసీల్దార్‌లు రామకృష్ణ, కరక సత్యనారాయణ, బాలాజీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment