ప్రజా హితమే లక్ష్యం
సాక్షి,పాడేరు: ప్రజా సంక్షేమం, హితమే లక్ష్యంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. జిల్లా కేంద్రం పాడేరులో వైఎస్సార్‌సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.పాడేరులోని తన క్యాంపు కార్యాలయం ఎదుట పార్టీ నేతలు,స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం కేక్‌ను కట్ చేశారు. తరువాత పాతబస్టాండ్ వరకు నేతలు ర్యాలీగా వెళ్లారు. అక్కడ దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాడేరు,అరకులోయ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు,రేగం మత్స్యలింగం,ఉమ్మడి విశాఖజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర,పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ప్రజాహి తమే లక్ష్యంగా, వారి పక్షాన పోరాటమే ధ్యేయంగా, డాక్టర్ వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైఎస్సార్‌సీపీని జగనన్న ఏర్పాటు చేశారన్నారు.గతంలో ప్రతిపక్షంలోఉండి ప్రజల పక్షాన అలుపెరగని పోరా టాలు చేశామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం,సీఎం జగనన్న నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేసిందని చెప్పారు. మాయమాటలు చెప్పి, బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని చెప్పారు.రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని,ప్రజలంతా మళ్లీ జగనన్న నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందన్నారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,జెడ్పీచైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్థాయి నుంచే కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేసి,మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పలు మండలాల ఎంపీపీలు అనూషాదేవి,శెట్టి నీలవేణి, బాకా ఈశ్వరి,బోయిన కుమారి,జెడ్పీటీసీలు పోతు రాజు బాలయ్యపడాల్,కిముడు శివరత్నం,కూడా బొంజుబాబు,చటారి జానకమ్మ, వైస్ ఎంపీపీలు కుంతూరు కనాకలమ్మ,కుడుముల సత్యనారాయణ,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర,జిల్లా పార్టీ నేతలు కిల్లు కోటిబాబునాయుడు, కూడా సురేష్‌కుమార్,ీ సదరి మంగ్లన్నదొర,జల్లి సుధాకర్,జల్లి హలియారాణి,తెడబారికి సురేష్‌కుమార్,గబ్బాడిశేఖర్,తిమోతి, సీదరి రాంబాబు,మత్స్యకొండంనాయుడు,కురుసా పార్వతమ్మ,గిడ్డివిజయలక్ష్మి,ఉర్వశిరాణి,శరభ సూర్య నారాయణ,లకే రామసత్యవతి,కోడా సుశీల,గల్లోంగిలక్ష్మికొండమ్మ,గిరి,అప్పారావు,పాంగిగుణబాబు,బసవన్నదొర,కొట్టగుళ్లినాగేంద్రకుమార్‌పాల్గొన్నారు.
మహానేత వైఎస్సార్ ఆశయ సాధనకు జగనన్న కృషి
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా
వైఎస్సార్‌సీపీదే విజయం
పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే
మత్స్యరాస విశ్వేశ్వరరాజు
ఘనంగా వైఎస్సార్‌సీపీ
ఆవిర్భావ దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment