రంపచోడవరం మండలం చెరువూరుకి చెందిన నాకు 2021–22 సంవత్సరంలో హౌసింగ్ స్కిమ్‌లో ఇల్లు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణం కోసం కొండరెడ్డిలకు రూ.1.80 లక్షలు ఇచ్చారు. చాలా మంది ఇళ్ల నిర్మాణాలను మధ్యలో నిలిపివేశారు. అయితే నేను రూ.1.50 లక్షలు అప్పు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాను. మధ్యలో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిన వారికి ఇటీవల అదనంగా డబ్బులు మంజూరు చేశారు. నాకు మాత్రం ఇవ్వలేదు. స్పందనలో అర్జీ ఇస్తే ఇంటి నిర్మాణం పూర్తయింది కాబట్టి అదనపు డబ్బులు రావంటున్నారు. నేను అప్పుచేసి ఇల్లు నిర్మించడమే పాపమైందా... మాకు న్యాయం చేయాలి .
– చోళ్ల చిలకరెడ్డి, చెరువూరు,
రంపచోడవరం మండలం