
చిత్రలేఖనంలో రాజవొమ్మంగి హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ
● నాలుగు బంగారు,
నాలుగు వెండి పతకాలు కై వసం
రాజవొమ్మంగి : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చిత్రలేఖనంలో ప్రతిభ చూపారు. 12వ ఆల్‌ఇండియా యూత్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ కాంపిటీషన్‌లో నాలుగు బంగారు, నాలుగు వెండి పతకాలు సాధించారు. ఇస్సాక్ అహ్మద్, హిమశ్రీ, హారిక, మణికంఠ బంగారు పతకాలు సాధించగా, బి.జీవన్‌దుర్గేంద్ర, డి. శ్రుతి, అమృత, మల్లిక వెండి పతకాలు పొందారు. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేసినట్టు హెచ్‌ఎం గోపాలకృష్ణ, డ్రాయింగ్ టీచర్ కొండబాబు తెలిపారు. డ్రాయింగ్ టీచర్ కొండబాబును ఈ సందర్భంగా నిర్వాహకులు గజమాలతో సత్కరించినట్టు హెచ్‌ఎం చెప్పారు. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, చైన్నె రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నట్టు హెచ్‌ఎం తెలిపారు.