వైఎస్సార్‌సీపీ సమావేశానికి సర్వం సిద్ధం
● పార్లమెంటు పరిశీలకుడిగా నేడు ధర్మశ్రీ బాధ్యతల స్వీకారం
కశింకోట: కశింకోటలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సరోజిని విల్లాలో శుక్రవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. పార్టీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్ సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు తదితరులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టారు. పార్టీ జెండాలను ప్రవేశ ద్వారం నుంచి సభా ప్రాంగణం వరకు వరుసగా చూడముచ్చటగా ఏర్పాటు చేశారు. సభా వేదికను అందంగా అలంకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, శ్రేణులు, అభిమానులు, పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు, గతంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు కూర్చోవడానికి అవసరమైన కుర్చీలను సమకూర్చి సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment