బ్రాండిక్స్ కార్మికుల మెరుపు సమ్మె
● పనివేళల పెంపుపై పెల్లుబికిన ఆగ్రహం ● గేట్లు తోసి బైఠాయించిన మహిళా కార్మికులు
అచ్యుతాపురం: బ్రాండిక్స్ కార్మికులు కదం తొక్కా రు. యాజమాన్యంపై తిరగబడ్డారు. ఎన్నడూ లేనిది మెరుపు సమ్మెకు దిగారు. ఏ, బీ షిప్ట్‌లలో పనిచేసే మహిళా కార్మికులకు పనివేళలను మరో అరగంట పెంచటమే తాజా ఉద్యమానికి కారణం అయ్యింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి షిప్ట్‌కు అరగంట చొ ప్పున అదనంగా పనిచేయాలని యాజమాన్యం కొ ద్ది రోజుల క్రితం సూచించింది. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళా కార్మికులు వారి కుటుంబాల ఆలనా పాలన వదిలేసి రాకపోకలు, పనివేళలను కలుపుకొని సుమారు 10 గంటలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో షిఫ్ట్‌కు అదనంగా మరో అరగంట పెంచాలని యాజమా న్యం నిర్ణయించి, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమ లు చేస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. కార్మికులు వ్యతిరేకించినప్పటి కీ యాజమాన్యం కాస్త నియంతృత్వ ధోరణి ప్రద ర్శించడంతో ఒకవైపు సీఐటీయూ నేతలు రంగంలోకి దిగడం, మరోవైపు కార్మికులు మెరుపు నిరసనకు దిగడంతో బ్రాండిక్స్ పరిసరాల్లో ఉద్రిక్త పరి స్థితి ఏర్పడింది. సీఐటీయూ నేతలు ఆర్ శంకర్రావు, ఆర్.రాము, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ స భ్యుడు కె.లోకనాథం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వరలక్ష్మి తదితరులు బ్రాండిక్స్ కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. విధులు నిర్వహిస్తున్న బ్రాండిక్స్ కార్మికులు గేట్లను తోసుకొని బైఠాయించి నినదించారు. పనివేళల పెంపు వల్ల కలిగే ఇబ్బందులను వివరించారు. కనీస వేతనాలు పెంచకపోగా, టార్గెట్లు ఎక్కువ చేస్తున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి దాటినా వారు ఆందోళన కొనసాగించారు. పెంచిన పనివేళలకు అంగీకరిస్తున్నట్టు లోపల సి షిఫ్టు కార్మికులతో యాజమాన్యం సంతకాలు చేయించుకున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment