ఆదివాసీ కూలీల వినూత్న నిరసన
పెదపేటలో గాంధీజీ చిత్రపటానికి చేతులు జోడించి నిరసన తెలుపుతున్న ఆదివాసీ కూలీలు
రోలుగుంట: తమకు పనులు కల్పించాలని కోరుతూ ఎం.పి.పట్నం పంచాయతీ శివారు పెదపేట గ్రామంలో ఉపాధి కూలీలు వినూత్నంగా నిరసన తెలిపారు. గురువారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి చేతులు జోడించి ‘బాపూ... మాకు ఉపాధి కల్పించే బుద్ధి మా నేతలకు ఇవ్వు’ అని వేడుకున్నారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఇ.చిరంజీవి మాట్లాడారు. అందరికీ ఉపాధి కల్పించాలన్న చట్టం ఇక్కడ అమలు కాలేదన్నారు. దీని వలన స్థానికులు పొరుగు జిల్లాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ గ్రామంలో 25 కుటుంబాలకు జిరాయితీ భూములున్నాయి. 12 కుటుంబాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్నాయి. కానీ ఆ భూముల్లో పనిచేసుకుందాం అంటే అధికారులు పని కల్పించలేదని ఆరోపించారు. కలెక్టర్ కార్యాయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment