నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..

Published Fri, Jan 31 2025 2:28 AM | Last Updated on Fri, Jan 31 2025 2:28 AM

-

●సాధారణంగా ఏదైనా భూమికి మ్యూటేషన్‌ చేసి ఆన్‌లైన్‌ చేయాలంటే పూర్వార్జితమైతే సంబంధిత పత్రాలు, వారసత్వ ధ్రువపత్రాలు, సర్వే సర్టిఫికెట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్‌ కాపీలు అందజేయాలి.

●కొనుగోలు చేసిన ఆస్తి అయితే సదరు భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు, ఈసీలు, సర్వే సర్టిఫికెట్లు సమర్పించాలి.

●వీఆర్‌ఓ, ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్‌లు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే మ్యూటేషన్‌ చేసి ఆన్‌లైన్‌ చేస్తారు.

కానీ.. అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగిన 7.30 ఎకరాల భూమికి ఎటువంటి పత్రాలు, దస్తావేజులు, సర్వే సర్టిఫికెట్లు లేకుండానే మ్యూటేషన్‌ చేసి ఆన్‌లైన్‌ చేసిపారేశారు. దీని ఆధారంగానే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ జరగడం, కొనుగోలు చేసిన వ్యక్తి పేరున ఆన్‌లైన్‌ అవ్వడం చకచకా జరిగిపోయాయి.

వెబ్‌ల్యాండ్‌ నిబంధనలకు విరుద్ధంగా..

ఇక ఈ వివాదాస్పద భూమి ఆన్‌లైన్‌ చేసే విషయంలో పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

●ఈ భూమిని 2012 మార్చి 19న 832 ఖాతా నెంబరుతో మడగల గోవిందు పేరున ఆన్‌లైన్‌ చేశారు.

●తర్వాత 2024 సెప్టెంబరు 9న 1104 ఖాతా నెంబరుతో గంటా అప్పారావు (జనసేన నాయకుడు నర్సింగరావు తండ్రి) పేరుతో ఆన్‌లైన్‌ చేశారు. తిరిగి ఇదే రోజు ఖాతా నెంబరు 2454తో గంటా నర్సింగరావు పేరుతో ఆన్‌లైన్‌ చేశారు.

●ఒక సర్వే నెంబరులో ఒకే రోజున ఇద్దరు వ్యక్తులకు రెండు ఖాతా నెంబర్లతో ఆన్‌లైన్‌ చేయడం ఇక్కడ కొసమెరుపు. ఇది పూర్తిగా వెబ్‌ల్యాండ్‌ నిబంధనలకు విరుద్ధం. వెబ్‌ల్యాండ్‌లో ఇలా ఒకేరోజు రెండు ఖాతా నెంబర్లలో ఒకే భూమిని ఆన్‌లైన్‌ చేయడంపట్ల అధికారులు సైతం విస్తుబోతున్నారు.

●ఈ బాగోతం వెనుక కొందరు రెవెన్యూ సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement