ఎన్నికల కోడ్ కూసినా..
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలై కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ పట్టణంలో అధికార యంత్రాంగానికి అదేమీ పట్టినట్టులేదు.. మెయిన్‌రోడ్డులో ఇరువైపులా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల ఫ్లెక్స్ బోర్డులు, కటౌట్లు దర్శనమిస్తున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యహరిస్తున్నారు. పట్టణ పరిధిలో సుంకరమెట్ట జంక్షన్ నుంచి శారదా బ్రిడ్జి, గుండా జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పూడిమడక జాతీయ రహదారి వరకూ ఇరువైపులా బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా నెహ్రూచౌక్ జంక్షన్‌లో బస్టాప్ వద్ద ఇవి అడ్డంగా ఉండడంతో బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడలి వద్ద ఎదురుగా ఎటువంటి వాహనాలు వస్తున్నాయో తెలియక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జీవీఎంసీ కమిషనర్, ఎంపీడీవో వెంటనే స్పందించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని బోర్డులను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
● అనకాపల్లిలో రహదారికి ఇరువైపులా ఫ్లెక్స్ బోర్డులు
Comments
Please login to add a commentAdd a comment