● సుందరానికి వారంలో రోజుల్లో బకాయిల చెల్లింపు ● జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావు
మాడుగుల: మాడుగుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుందరం జీతం ఏడాదిగా అందలేదని సాక్షిలో ప్రచురితమైన వార్తకు జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు స్పందించారు. గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు సీఎఫ్‌ఎంఎస్‌లో అతని పేరు మోడిఫైడ్ చేయకపోవడం వలనే సీనియర్ అసిస్టెంట్ సుందరానికి జీతం అందలేదన్నారు. ఈ సాంకేతిక లోపాన్ని ట్రెజరీలో సరిచేసి వారం రోజుల్లో జీతం మొత్తం అందజేయడానికి కృషి చేస్తామన్నారు.
అన్ని రకాల రిజిస్ట్రేషన్లు సులభతరం: డీఐజీ బాలకృష్ణ
ఈనెల నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం వలన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు సులభతరం చేస్తామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల డీఐజీ జి.బాలకృష్ణ అన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆన్‌లైన్ ప్రక్రియను మరింత సులభంగా మారుస్తామన్నారు. సీనియర్ అసిస్టెంట్ సుందరం జీతం వారం రోజుల్లో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment