![ఎమ్మెల్సీ స్థానానికి మరో నామినేషన్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06vsc91-320092_mr-1738872454-0.jpg.webp?itok=P6mASrjB)
ఎమ్మెల్సీ స్థానానికి మరో నామినేషన్
నామినేషన్ దాఖలు చేస్తున్న పీడీఎఫ్ మద్దతు అభ్యర్థి కోరెడ్ల విజయకుమారి
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నాలుగో రోజు ఒక నామినేషన్ దాఖలైంది. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి దాఖలైన నామినేషన్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. గురువారం పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి కోరెడ్ల విజయకుమారి తన మద్దతుదారులతో కలిసి విశాఖ ఆర్వో, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌కు సంబంధిత నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం కలెక్టర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. డీఆర్వో, ఏఆర్వో బి.హెచ్. భవానీ శంకర్, నోడల్ అధికారి దయానిధి, ఎన్నికల సెల్ అధికారులు అభ్యర్థికి సహకారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment