ఆర్‌ఈసీఎస్ ఎండీగా ప్రసాద్
కశింకోట: కశింకోటలోని గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్) ఎండీగా ఏపీఈపీడీసీఎల్ అనకాపల్లి సూపరింటెండింగ్ ఇంజినీర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఆర్‌ఈసీఎస్‌కు పర్సన్ ఇన్‌చార్జిగా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ వ్యవహరిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు పూర్తి ఆర్‌ఈసీఎస్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రసాద్ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ పర్సన్ ఇన్‌చార్జిగా నియామకం కాక ముందు సహకార శాఖకు చెందిన శ్యామల పర్సన్ ఇన్‌ఛార్జి, ఎండీలుగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను ఎండీగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment