అధికారుల నిర్లక్ష్యమే కారణం..
చోడవరం దగ్గర బంకులో పెట్రోల్ కొట్టించాను. కొంచెం దూరం వెళ్లి ఇంజిన్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ షెడ్‌కు తెచ్చాను. ఆయిల్ కల్తీ వల్లే ఇంజిన్ పట్టేసిందని మెకానిక్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో కల్తీని నివారించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే మా వాహనాలు పాడవుతున్నాయి. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి.
– అప్పలనాయుడు, వాహదారుడు, చోడవరం
ఆయిల్ కల్తీని అరికట్టాలి..
నేను కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం బయలుదేరాను. వెంకన్నపాలెం సమీపంలోని ఒక బంకులో నా బైక్‌లో 2 లీటర్ల పెట్రోల్ కొట్టించాను. ఇక్కడ ఆయిల్ వేయించిన తర్వాత సైలెన్సర్ నుంచి పొగ ఎక్కువగా వచ్చింది. మెకానిక్ షెడ్‌కు తీసుకెళ్తే కల్తీ ఆయిలే కారణమని అన్నారు. రీడింగ్‌లో కూడా మోసం జరుగుతోంది. లీటర్ ఆయిల్ పూర్తిగా రావడం లేదు. బంకుల్లో ఆయిల్ కల్తీ, కొలతల్లో మోసాలను అరికట్టాలి.
– సీహెచ్ శ్రీనివాసరావు, వాహనదారుడు, చోడవరం
Comments
Please login to add a commentAdd a comment