నూకాంబిక హుండీ ఆదాయం రూ.44.66 లక్షలు
హుండీ లెక్కిస్తున్న సిబ్బంది, శ్రీవారి సేవా సభ్యులు
అనకాపల్లి టౌన్: నూకాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు దేవస్థానం ఉత్సవ మండపం ఆవరణలో శనివారం జరిగింది. గత ఏడాది అక్టోబర్ 28వ తేదీ నుంచి శనివారం వరకు 138 రోజులలో భక్తులు సమర్పించిన ముడుపులు, మొక్కుబడులను లెక్కించారు. రూ.44,65,787 నగదు, 20.500 మిల్లీగ్రాముల బంగారం, కేజీ 925 గ్రాముల వెండి హుండీల ద్వారా వచ్చినట్లు ఎండోమెంట్ సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి వెంపలి రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీ సుధారాణి, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వసంతకుమార్, శ్రీవారి సేవ సభ్యులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment