ఆరు ఎకరాల్లో జీడి, మామిడి తోటలు దగ్ధం
రోలుగుంట: కూసుర్లపూడి గ్రామానికి చెందిన రైతుల జీడితోటల్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో జీడి, మామిడి తోటలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పచ్చిగోళ్ల భవన్నారాయణకు చెందిన ఎకరా యాకలిప్టస్, మటం బెన్నయ్య, కూండ్రపు శ్రీను, గున్నంపల్లి కొండ, సియాద్రి అప్పారావుకి చెందిన జీడి, మామిడి తోటలు అయిదెకరాలు కాలి బూడిదయ్యాయి. దీనిపై బాధితులు తమకు ఎవరిపైనా అనుమానం లేదని తెలిపారు. ప్రమాదంలో వాటిల్లిన నష్టాన్ని సంబంధిత అధికారలు అంచనా వేసి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment