కశింకోట: కశింకోటలోని కస్పావీఽధిలో జరిగిన పడమటమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎడ్లబళ్ల పోటీలో ఓ పాము హల్‌చల్ చేయడం కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి భయం లేకుండా జెర్రిగొడ్డుగా పిలిచే సుమారు 5 అడుగుల పొడవు ఉన్న పెద్ద పామును తోక పట్టుకుని తెచ్చి చూపుతూ, కొంతసేపు నేలపై విడిచి పెట్టి దాన్ని పరుగులు పెట్టిస్తూ కలియదిరిగాడు. దీంతో పోటీలు చూడడానికి వచ్చిన వారు పరుగులు తీసి వెళ్లి పామును ఆసక్తిగా వీక్షించారు.అయితే ఇది విష పూరితమైనది కాదని, దూరంగా పొలాల వైపు తీసుకెళ్లి ఆ వ్యక్తి విడిచిపెట్టారు.