కశింకోటలో సినిమా షూటింగ్ సందడి
కశింకోట: కశింకోటలోని ఆర్‌ఈసీఎస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో ‘అనకాపల్లి’ పేరిట నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నూతన నటీనటులు, దర్శకులతో దీన్ని నిర్మిస్తున్నారు. లగడపాటి విక్రం, సంధ్య హీరో, హీరోయిన్లగా దర్శకుడు కాగేష్ తొలి ప్రయత్నంగా నిర్మాణం చేపట్టారు. సినిమాలో కొంత మేర క్‌లైమాక్స్ దృశ్యాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆర్‌ఈసీఎస్ కార్యాలయం వెనుక భాగంలో బెల్లం దిమ్మెల శ్రేణి, చెరకు గడలు, బెల్లం తయారీ పెనం ఏర్పాటు చేయడంతోపాటు పొగాకు తోరణాలతో అలంకరించిన గుడిసెల సెట్ వేశారు. వాటిలో రొమాన్స్‌కు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. కొంత కాలంగా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేస్తున్నామని, నెలాఖరుకు పూర్తి కానుందని మేనేజర్ తెలిపారు.
కశింకోటలో సినిమా షూటింగ్ సందడి
Comments
Please login to add a commentAdd a comment