ఇందిరా మార్కెట్‌లో చోరీ
నర్సీపట్నం : మున్సిపాలిటీ ఇందిరా మార్కెట్‌లోని శ్రీనివాస్ ట్రేడింగ్ కిరాణా దుకాణంలో ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి చోరీ జరిగింది. షాపు పైకప్పు సిమెంట్ రేకును కట్ చేసి లోపలికి ప్రవేశించి కిరాణా సామాన్లతో పాటు కౌంటర్‌లోని కొంత నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయారు. షాపు యజమాని అంజూరి శ్రీనివాసరావు ఉదయం షాపు తెరిచి చూసేసరికి పైకప్పు రంధ్రం చేసి ఉండడంతో షాపులోని ఆయిల్ డబ్బాలు, సబ్బులు, కిరాణా సామాన్లు పట్టుకుపోవడాన్ని గుర్తించి లబోదిబోమన్నాడు. మొత్తం కిరాణా సామాన్లు, నగదు కలిపి రూ.లక్ష వరకు చోరీ జరిగిందని షాపు యజమానికి తెలిపాడు. రెండు నెలల కాలంలో వరుసగా మార్కెట్‌లో నాలుగు దొంగతనాలు జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. చోరీలను ఆరికట్టి వ్యాపారులకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. చోరీపై టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.