ఐఐఎంవీలో నూరుశాతం ప్లేస్‌మెంట్స్
తగరపువలస: ఐఐఎంవీ 2024–2026 బ్యాచ్ నూరుశాతం నియామకాలతో వేసవిని విజయవంతంగా ముగించినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ గత రికార్డులు అధిగమించి విద్యార్థులకు ఏమి అవసరమో అదే బోధించబడుతుందన్నారు. ఇందుకు తమ అధ్యాపకులు అభినందనీయులన్నారు. దేశంలోని ప్రముఖ రిక్రూటర్లు తమ విద్యార్థుల సామర్‌ాధ్యలను గుర్తించడం తమకు గర్వకారణమన్నారు. వేసవి ప్లేస్‌మెంట్ ప్రక్రియలో 344 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. 130 మంది రిక్రూటర్లు తమ నియామక జాబితాలో చేరారన్నారు. వీరిలో 77 మంది కొత్తగా తమతో భాగస్వామ్యం పొందారన్నారు. కెరీర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ చైర్‌పర్సన్ దీపికాగుప్తా మాట్లాడుతూ ప్రపంచ వాతావరణంలో కొనసాగుతున్న అనిశ్చితి, సందిగ్ధత కారణంగా ఈ వేసవి ఆందోళన కలిగించినా అంచనాలు అధిగమించి నూరు శాతం ఫలితాలు సాధించామన్నారు. గత ఏడాదితో పోలిస్తే స్లయిఫండ్‌లో 45.83 శాతం పెరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment