ఆల్ ఇండియా టోర్నమెంట్‌కు డిగ్రీ కాలేజీ విద్యార్థి
విద్యార్థి సోమేశ్వరరావును అభినందిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు
నర్సీపట్నం : ఆంధ్ర యూనివర్శిటీలో బుధవారం జరిగిన యూనివర్శిటీ బేస్‌బాల్ సెలక్షన్‌లో యూనివర్శిటీ జట్టుకు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న రావుల సోమేశ్వరరావు సెలెక్ట్ అయ్యాడు. యూనివర్శిటీ టీం తరపున త్వరలో పంజాబ్‌లో జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ బేస్‌బాల్ టోర్నమెంట్‌లో అడనున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి సోమేశ్వరరావును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు కాలేజీ తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.