బాలకార్మికులతో పనిచేయిస్తే కేసులు
● ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో రెండు దుకాణాల్లో తనిఖీలు
మాడుగుల రూరల్ : బాల కార్మికులతో పనులు చేయిస్తే అటువంటి యజమానులపై కేసులు నమోదు చేస్తామని, చోడవరం సహయ కార్మిక అధికారి పి. సూర్యనారాయణ అన్నారు. ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో గల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. శ్రీ విజయలక్ష్మి ఇంజినీరింగ్ వర్కుషాపులో పనిచేస్తున్న బాలకార్మికుడు, క్రేజి జ్యూస్ సెంటర్‌లో పనిచేస్తున్న మరో బాలకార్మికుడిని ఈ తనిఖీల్లో గుర్తించారు. వారికి తక్కువ జీతం ఇస్తున్నట్టు తెలుసుకున్నారు. కనీస వేతనాల చట్టం 1948 కింద పై అధికారి వద్ద క్లయిమ్‌లకు దాఖలు చేస్తామని, 18 సంవత్సరాలు వయస్సు నిండని బాలలు చేత పని చేయించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment