ముషిడిపల్లిలో వైద్య సేవలపై ఆరా తీస్తున్న జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యులు
దేవరాపల్లి: ముషిడిపల్లి గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం శుక్రవారం పర్యటించింది. నలుగురు సభ్యులతో కూడిన జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం ముందుగా ఆయూష్ ఆరోగ్య మందిర్ (విలేజ్ హెల్త్ క్లినిక్)ను సందర్శించింది. డీపీఎంవో డా.ప్రశాంతి, డీపీవో జగదీష్, ఎస్‌వో రామచంద్ర, డేటా మేనేజర్ జనార్దన్ తదితర జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు అక్కడ పలు రికార్డులను తనిఖీ చేశారు. స్థానికంగా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక ప్రజలకు, విద్యార్థులకు అందించిన వైద్య సేవలను, యాప్‌లో నమోదు చేసిన వివరాలను సరిపోల్చి చూశారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి రోగుల ఇంటికి వెళ్లి కలిసి వైద్య సేవలు అందాయా లేదా అని ఆరా తీశారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి ఇ.పూజ్య మేఘన తదితర ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, వైద్య సిబ్బంది ఉన్నారు.