రాష్ట్ర హాకీ జట్టు శిక్షణకు ఇద్దరు యలమంచిలి క్రీడాకారుల
యలమంచిలి రూరల్ : ప్రతిభావంతులైన హాకీ క్రీడాకారులకు నిలయమైన యలమంచిలి పట్టణానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర హాకీ సీనియర్ జట్టు ప్రాబబుల్స్ బృందంలోకి ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన బి.కుసుమకుమార్, జి.ప్రసాద్‌లను జిల్లా నుంచి రాష్ట్ర జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపిక చేస్తూ సెలెక్టర్లు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర హాకీ సీనియర్ల జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధికారులు ఎంపిక చేశారు. వీరందరికీ ఈ నెల 25 నుంచి కాకినాడలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో తర్ఫీదునిస్తారు. 10 రోజుల శిక్షణ అనంతరం 18 మంది క్రీడాకారులను జాతీయ పోటీల్లో పాల్గొనే జట్టులోకి ఎంపిక చేస్తారని జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోఠారు నరేష్ ఆదివారం రాత్రి తెలిపారు. జిల్లా నుంచి ఎంపికై న క్రీడాకారులిద్దర్నీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అభినందించారు.
రాష్ట్ర హాకీ జట్టు శిక్షణకు ఇద్దరు యలమంచిలి క్రీడాకారుల
Comments
Please login to add a commentAdd a comment