రావికమతం : నేషనల్ ఇంగ్లీషు టాలెంట్ టెస్టులో మరుపాక మోడల్ స్కూల్ విద్యార్ధిని కె.కీర్తన రెండో ర్యాంక్ సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 న ఆంధ్ర, తెలంగాణలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఒలింపియాడ్ నిర్వహించిన ఇంగ్లిష్ టాలెంట్ టెస్టులో పాల్గొన్నారు. వీటి ఫలితాలు ఆదివా రం విడుదల చేయగా వాటిలో మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న కీర్తన రెండవ ర్యాంక్ సాధించింది. దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కీర్తనను ఉపాధ్యాయులు ,తదితరులు అభినందించారు.