ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే’ జోన్
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు ఎంతో చరిత్ర ఉంది. 1927లో బ్రిటిష్ హయాంలో రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. 1956లో డివిజన్‌గా మార్చారు. 1977లో దక్షిణ మధ్య రైల్వేలో భాగమైంది. అప్పటి నుంచి దక్షిణ మధ్య రైల్వేకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఏటా రూ.3,000 కోట్ల పైగానే ఆదాయాన్ని డివిజన్ ఆర్జిస్తోంది. ఇది రైల్వే డివిజన్ల సగటు ఆదాయంతో పోల్చినా ఎంతో ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 1,449 కి.మీ రైల్వేలైనుతో 157 రైల్వేస్టేషన్లను గుంతకల్లు డివిజన్ కలిగి ఉంది. డివిజన్ పరిధిలో రోజు 268 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతోపాటు 150కు పైగా గూడ్స్‌రైళ్లు వెళ్తున్నాయి. సరాసరి రోజూ రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతటి ఘన చరిత ఉన్న గుంతకల్లు రైల్వే డివిజన్‌పై కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. గత కొన్నేళ్ల్లుగా బడ్జెట్‌లో మొండి చేయి చూపుతోంది. దశాబ్ద కాలంగా ఒక్క కొత్త రైలును కూడా డివిజన్‌కు కేటాయించలేదు. డివిజన్ కేంద్రం నుంచి ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కటి కూడా లేదు. దీనిపై రైల్వే సిబ్బందే కాకుండా, రాయలసీమ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
395 కి.మీ రైలు మార్గం కుదింపు..
గుంతకల్లు రైల్వే డివిజన్ కుదింపు కార్యక్రమం చాలా ఏళ్లుగా జరుగుతోంది. గతంలో హుబ్లీ జోన్, గుంటూరు డివిజన్ ఏర్పడిన సందర్భంగా గుంతకల్లు రైల్వే డివిజన్ భారీగా రైలు మార్గాలను కోల్పోయింది. తాజాగా విశాఖపట్నం జోన్ కారణంగా గుంతకల్లు డివిజన్‌పై మరో పెద్ద దెబ్బ పడుతోంది. హుబ్లీ జోన్‌గా అప్‌గ్రేడ్ చేసే సమయంలో గుంతకల్లు డివిజన్‌లోని బళ్లారి–హొస్పేట్, తోర్నగల్–రంజిత్‌పూర సెక్షన్ మధ్య దాదాపు 136 కి.మీలతోపాటు 16 రైల్వేస్టేషన్లను కోల్పోయింది. గుంటూరు డివిజన్ ఏర్పాటు సమయంలో పాణ్యం–దొనకొండ మధ్య దాదాపు 151 కి.మీ రైలు మార్గంతో పాటు 14 రైల్వేస్టేషన్లను కోల్పోయింది. ప్రస్తుతం కొత్త రైల్వే జోన్‌తో 108 కి.మీతోపాటు మరో 12 రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్ డివిజన్‌లోకి కలుపుతున్నారు. దీంతో గుంతకల్లు రైల్వే డివిజన్ దాదాపు 395 కి.మీ రైలు మార్గంతోపాటు 42 రైల్వేస్టేషన్లు కోల్పోయినట్లవుతోంది.
తగ్గుతోన్న గుంతకల్లు రైల్వే డివిజన్ ప్రభ
కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటే శాపం
ఆదాయం ఘనంగా ఉన్నా కానరాని ఆదరణ
కేంద్ర ప్రభుత్వ శీతకన్నుపై సిబ్బంది ఆగ్రహం
ప్రజాప్రతినిధులూ స్పందించరూ..
వాస్తవానికి గుంతకల్లు డివిజన్‌ను రైల్వే జోన్ చేయాలనే డిమాండ్ రాయలసీమవాసుల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే తగినంత రాజకీయ మద్దతు లేకపోవడంతో కల సాకారం కావడం లేదు. అయితే, ప్రస్తుత పరిస్థితులతో జోన్ సంగతి ఏమోగానీ, ఉన్న డివిజన్‌ను కాపాడుకోవడమే ఇప్పడు ప్రధానాంశంగా మారింది. జిల్లా మీదుగా విశాఖకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ తప్పితే మరో రైలు లేదు. విజయవాడకు కూడా రెండు, మూడు రైళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ రూట్‌లో నడుస్తున్న అరకొర రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటాయి. బెర్తులు దొరకక ప్రత్యక్ష నరకం కనిపిస్తుంటుంది. కనీసం కొత్త రైల్వేజోన్ ఏర్పాటు సందర్భంగా గుంతకల్లు మీదుగా విజయవాడ, విశాఖపట్నం మార్గంలో రైళ్లు పెంచాలని ఈ ప్రాంతా ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే’ జోన్
Comments
Please login to add a commentAdd a comment