అరటి నాణ్యతపై ఆరా
అనంతపురం అగ్రికల్చర్/ రాప్తాడు/ తాడిపత్రి రూరల్: అరటి నాణ్యత పరిశీలనకు ఆదివారం జిల్లాకు వచ్చిన ఇంగ్లండ్‌కు చెందిన ఫెయిర్‌ట్రాసా ఆర్గనైజేషన్ కంపెనీ ఫౌండర్ కమ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాత్రిక్ స్ట్రబై వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఉద్యానశాఖ కమిషనరేట్ జేడీ డాక్టర్ దేవమునిరెడ్డి, జిల్లా డీడీ బీఎంవీ నరసింహారావు తదితరులతో కలిసి మొదట రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఉన్న ఎలైట్ టిష్యూ కల్చర్ బనానా ల్యాబ్‌ను సందర్శించారు. అందులో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన రోగ రహితమైన టిష్యూకల్చర్ అరటి మొక్కల గురించి ల్యాబ్ ఎండీ రాఘవేంద్రను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో ఎస్‌కే బనానా కంపెనీ ఆధ్వర్యంలో తోటల నుంచి అరటి గెలలు సేకరిస్తున్న విధానం గురించి ఆరా తీశారు. అక్కడి నుంచి తాడిపత్రి మండలం చుక్కలూరులో కోల్డ్‌స్టోరేజీని సందర్శించారు, అక్కడే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంగ్లండ్ ప్రతినిధితో మాట్లాడారు. అరటి నాణ్యత, ఉత్పత్తి గురించి వివరించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు రత్నకుమార్, శైలజ, ఉమాదేవి, ఎస్‌కే బనానా కంపెనీ ప్రతినిధి నరసింహారెడ్డి, గ్రీన్‌ట్రాఫిక్ కంపెనీ ప్రతినిధి రామోజీ, నోవా కంపెనీ ప్రతినిధి ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment