బీజేపీ నేతల బాహాబాహీ
ఉరవకొండ: జిల్లా బీజేపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందరి సమక్షంలోనే నువ్వేంత అంటే నువ్వేంత అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగారు. ఒకానొక దశలో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. వివరాలు.. పీఎం విశ్వకర్మ కింద ఎంపికై న లబ్ధిదారులకు ఉరవకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటు చేశారు. శిక్షణా కేంద్రం పర్యవేక్షణ బాధ్యతలను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టుబడి సురేష్ తీసుకోగా, తనిఖీ చేయడానికి ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌తో పాటు ముఖ్యనేతలూ వచ్చారు. ఈ సందర్భంగా వారికి శిక్షణలో తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను లబ్ధిదారులు వివరించారు. దీనిపై రాజేష్ మాట్లాడుతూ.. కనీస వసతులు కల్పించలేదని, నాణ్యమైన భోజనం కూడా అందించకపోతే ఎలా అంటూ నిర్వాహకులను నిలదీశారు. అక్కడే ఉన్న సురేష్ వెంటనే వాగ్వాదానికి దిగడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి నెలకొనడంతో కొందరు బీజేపీ నేతలు కల్పించుకుని ఇరువర్గాలను పక్కకు తీసుకెళ్లారు. ఘటనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాజేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment