ప్రాణాలు బలిగొన్న మద్యం
గుంతకల్లు టౌన్: అతిగా మద్యం సేవించి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పాత గుంతకల్లులోని వడ్డే వీధికి చంఎదిన వడ్డే మస్తాన్ (59) దివ్యాంగుడు. పదిహేనేళ్ల క్రితంభార్య సరోజమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తున్న అతడు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 1న శనివారం దివ్యాంగుల కోటా కింద పింఛన్ అందుకున్న ఆయన... ఆదివారం తన వాహనంపై కొనకొండ్ల రోడ్డులోని పెట్రోల్ బంక్ వెనుక గల ప్లాట్లల్లో అతిగా మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రెండు రోజుల తర్వాత సోమవారం ఉదయం అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పామిడిలో ఉన్న కుమారుడు వడ్డే ఉమేష్ అక్కడకు చేరుకుని పరిశీలించాడు. అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ సీఐ మనోహర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment