నీటికుంటలో బాలుడి గల్లంతు
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని నారాయణపురం గ్రామంలో ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటి కుంటలో గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు... నారాయణపురం గ్రామానికి చెందిన దుర్గేష్, ప్రీతి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు దర్శి అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగాడు. ఘటనతో భయపడిన స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. సాయంత్రమైన దర్శి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం ఽబాలుడి స్నేహితులను కుటంబసభ్యులు ఆరా తీశారు. దీంతో దర్శి గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ వెంటనే స్పందించి అగ్ని మాపక సిబ్బంది సాయంతో కుంటలో గాలింపు చేపట్టారు. చీకటి పడుతున్నా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం తిరిగి గాలింపు చేపట్టనున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment