● వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల్లో వితంతు, లీగల్లీ సపరేట్ మహిళా ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర నాయకులు గోపాల్, వెంకటరమణప్ప డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో వారిని పలువురు మహిళా టీచర్లు కలసి తమ సమస్యలు విన్నవించారు. వితంతు, లీగల్లీ సపరేటెడ్ మహిళా ఉపాధ్యాయులకు బదిలీ చట్టంలో కేవలం పాయింట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ.. వితంతు, లీగల్లీ సపరేట్ మహిళా ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరిలోనే బదిలీలు నిర్వహించాలన్నారు. గతంలో మహిళలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తూ చైల్డ్ కేర్ లీవులు కూడా 180 రోజులకు పెంచారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కూడా మహిళా ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.
యువకుడి బలవన్మరణం
గుత్తి: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని పత్తికొండ రైల్వే గేటు వద్ద మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్‌పీ ఎస్‌ఐ నాగప్ప తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన సురేష్ (25) కర్ణాటకలోని రాయచూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఓబులాపురం బయలుదేరిన సురేష్ మంగళవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక పరమైన అంశాలే ఆయన ఆత్మహత్యకు కారణాలుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment