పీజీ తెలుగు పాఠ్యాంశంగా ‘తడియారని స్వప్పం’
అనంతపురం: ప్రముఖ కవి లోసారి సుధాకర్ రచించిన ‘తడియారని స్వప్నం’ కవితా సంపుటిని ఎస్కేయూ ఎంఏ తెలుగు కోర్సులో పాఠ్యాంశంగా చేర్చారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి 2027–28 విద్యా సంవత్సరం వరకూ ఈ పాఠ్యాంశం ఉంటుంది. ఈయన ప్రస్తుతం విజయవాడ ఏసీబీ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన రచించిన మొదటి కావ్యం ‘మైనపు బొమ్మలు’ సైతం ఎస్కేయూతో పాటు యోగివేమన వర్సిటీ, రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పాఠ్యాంశంగా చేర్చిన విషయం తెలిసిందే. తడియారని స్వప్నం కవితా సంపుటిలో వస్తు వైవిధ్యం, సామాజిక స్పృహ, సీ్త్ర దృక్కోణం, దళిత స్పృహ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. కాగా, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కర్ణాటక నాగేపల్లికి చెందిన లోసారి సుధాకర్ ఎస్కేయూలో 1990–92 బ్యాచ్‌లో ఎంఏ పొలిటికల్ సైన్సెస్ పూర్తి చేశారు. పొలిటికల్ సైన్సెస్ చదివినప్పటికీ, తెలుగు సాహిత్యం, కవిత్వంపై మంచి పట్టు ఉంది. అనేక కవిత్వాలు, గ్రంథాలు రచించారు.
Comments
Please login to add a commentAdd a comment