హెచ్చెల్సీలో ఓ అవినీతి బాగోతం వెలుగుచూసింది. రైతులు పండ
ఫిర్యాదులొచ్చాయి..
కణేకల్లు మండలంలో ధాన్యం వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో కూడా ఫిర్యాదులు రావడంతో విచారణ చేశారు. ఈ ఏడాది మళ్లీ వచ్చాయి. అక్కడ ఉద్యోగుల మధ్య వివాదం కారణంగా ఇలా జరుగుతోంది. దీనిపై మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ విచారిస్తున్నారు.
– రాజశేఖర్, ఎస్‌ఈ, హెచ్చెల్సీ
విచారణ జరుగుతోంది..
ఈఎన్‌సీ ఆదేశాల మేరకు కణేకల్లులో ఓ డీఈ, లస్కర్లపై విచారణ చేస్తున్నాం. అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలియడం లేదు. విచారణ పూర్తయితే తప్ప చెప్పలేం. త్వరలో దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం.
– విశ్వనాథరెడ్డి, ఎస్‌ఈ, చిన్న నీటిపారుదల శాఖ
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ద్వారా ప్రతి ఏటా లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నారు. ఇందులో రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లోనే 40 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. ఇక్కడి రైతుల్లో సింహభాగం వరిని సాగు చేస్తున్నారు. జిల్లాలో పండిస్తున్న వరిధాన్యంలో సగం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి అవుతోంది.
బలవంతంగా వసూళ్లు..
తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్‌ఎల్‌ఎంసీ)లో డిస్ట్రిబ్యూటరీల కింద సాగు చేస్తున్న రైతుల నుంచి ఎకరాల ప్రకారం అక్రమంగా ధాన్యం వసూలు చేస్తున్నారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు అందించే లస్కర్లు, డీఈ స్థాయి అధికారులు కుమ్మక్కై ఈ బాగోతం నడిపిస్తున్నారు. ఏదో బస్తానో రెండు బస్తాలో కాకుండా ఏటా రూ. లక్షలు విలువజేసే ధాన్యం అక్రమంగా సేకరిస్తున్నారని తెలుస్తోంది. అనధికారికంగా పంటలు సాగు చేసుకునే రైతుల నుంచైతే రెట్టింపు స్థాయిలో తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన ధాన్యాన్ని స్థానికంగా మిల్లుల్లో ఆడించిన అనంతరం విక్రయించి... ఆ వచ్చే డబ్బును వాటాలుగా పంచుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అయితే ఈ సారి లస్కర్లు, ఓ డీఈకి మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో వివాదం రేగింది. ఒకరిపై ఒకరు నేరుగా ఈఎన్‌సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)కి ఫిర్యాదు చేసుకున్నారు. స్పందించిన ఆయన... వాస్తవాలను నిగ్గు తేల్చాలంటూ జిల్లా చిన్ననీటి పారుదలశాఖ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. దీనిపై గుట్టుగా విచారిస్తున్నారు.
సర్వత్రా విమర్శలు..
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఒకవైపు పెట్టుబడులు తడిసి మోపెడవుతుంటే.. మరోవైపు చీడపీడల ధాటికి అల్లాడిపోతున్నారు. ఇక ప్రకృతి కోపిస్తే నష్టాలను మూటగట్టుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలవాల్సింది పోయి పీల్చిపిప్పి చేస్తున్న వైనం విమర్శలకు దారితీస్తోంది.
హెచ్చెల్సీలో అవినీతి బాగోతం
రైతుల నుంచి ఇష్టారాజ్యంగా ధాన్యం వసూళ్లు
ప్రతి ఏటా దందా
ఈ సారి తేడాలు రావడంతో రచ్చ
ఈఎన్‌సీ ఆదేశాలతో గుట్టుగా విచారణ
హెచ్చెల్సీలో ఓ అవినీతి బాగోతం వెలుగుచూసింది. రైతులు పండ
హెచ్చెల్సీలో ఓ అవినీతి బాగోతం వెలుగుచూసింది. రైతులు పండ
హెచ్చెల్సీలో ఓ అవినీతి బాగోతం వెలుగుచూసింది. రైతులు పండ
Comments
Please login to add a commentAdd a comment