అనంతపురం: జేన్‌టీయూ ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆడిటోరియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
15లోపు సప్లి ఫీజు చెల్లించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 2016–17 నుంచి 2018–19 విద్యాసంవత్సరాల డిగ్రీ విద్యార్థులకు మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈ నెల 15లోగా చెల్లించాలని సూచించారు. ఈ నెల 16 నుంచి 18 వరకు రూ. వెయ్యి అదనపు రుసుముతో చెల్లించవచ్చని, 19 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే వరకు రూ.3 వేల అదనపు రుసుముతో ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. మెగా సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24న మొదలయ్యే అవకాశం ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో పరీక్షల విభాగాధిపతిని సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment