స్వీపర్ సావిత్రమ్మ ‘సూపర్’
●వివిధ రంగాల్లో మహిళల ప్రతిభ ●పురుషులతో దీటుగా రాణిస్తున్న వైనం
ఆది యందు ‘ఆమె’ ఉండెను
అప్పటి నుంచీ అన్నీ ‘ఆమె’ అయెను...
బడిలో, గుడిలో, నారుమడిలో..
ఆమెలేని చోటులేదు..ఆమెకు సాటి లేదు..
కలం పట్టినా...హలం దున్నినా..
అధికారం చూపినా..అక్కున చేర్చుకున్నా..
అంతా ఆమె...అన్నింటా ఆమె..
సృష్టి, స్థితి, లయకారులకూ ‘ఆమె’నే ధైర్యం..
‘ఆమె’కెన్నో రూపాలు.. మనం కూడా ప్రతిరూపాలమే..
ఆమె ఒక ధైర్యం..ఆ ఆదరణ లేకపోతే అంతా శూన్యం..
ఆమెను తలిస్తే అన్నీ దర్శించినట్టే..
అందుకే ఆమె కోసం ఓ రోజు..
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
బతుకుపాఠంలో చెరగని ముద్ర వేసిన మహిళా మణుల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
గుంతకల్లుకు చెందిన సుంకన్న, సావిత్రమ్మ నిరుపేద దంపతులు. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిలు సంతానం. పదేళ్ల క్రితం భర్త కరెంట్ షాక్‌తో మరణించాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న భర్త ఆశయాన్ని సావిత్రమ్మ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించింది. అవుట్‌సోర్సింగ్ కింద స్థానిక మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించింది. ఇంజినీరింగ్ చదివిన పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఇస్రోలో ఉద్యోగం సాధించాడు. కన్యాకుమారిలోని ఇస్రోలో గ్రూప్–సీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. కుమార్తెకు వివాహం చేసి పంపింది. ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పాసై 2019లో సావిత్రమ్మ బ్యాక్‌లాగ్ పోస్ట్‌కు ఎంపికై అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పబ్లిక్‌హెల్త్ వర్కర్(స్వీపర్)గా పనిచేస్తోంది. తన తల్లి సహకారంతోనే తాను ఈస్థాయికి ఎదిగానని, స్వీపర్‌గా పనిచేస్తూనే తమను ప్రయోజకులుగా తీర్చిదిద్దిందని ఇస్రో శాస్త్రవేత్త దేవేంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. – గుంతకల్లు టౌన్:
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment