No Headline
ఆమె ఆలోచన పలువురిని కదిలించింది. అంతా ఒక సంఘంగా ఏర్పడి సామాజిక సేవవైపు నడిచారు. తాడిపత్రిలోని ఓంశాంతినగర్‌కు చెందిన భూమా రాగిణి సారథ్యంలో మొదట నలుగురు స్నేహితులతో కలిసి ‘ఫెమినైన్’ అనే సంస్థను ప్రారంభించారు. ఆస్పత్రిలో రోగులకు అన్నదానంతో ప్రారంభమైన సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. అలా మూడు నెలల వ్యవధిలోనే వివిధ జిల్లాల నుంచి మొత్తం 190 మంది మహిళలు ఇందులో సభ్యులుగా చేరి సేవలో పాలు పంచుకుంటున్నారు. ప్రతి సభ్యురాలు నెలనెలా సేవా కార్యక్రమాల కోసం కొంతమొత్తం వెచ్చిస్తున్నారు. అంతేకాదు సభ్యుల్లోని కుటుంబాల్లో పుట్టిన రోజు తదితర శుభకార్యాల సందర్భాలను పురస్కరించుకుని అభాగ్యులకు అవసరమైన సహాయాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు దివ్యాంగులకు వీల్‌చైర్లు, మూడు చక్రాల సైకిళ్లు, ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు అందించారు. ఓ పేదరిక కుటుంబానికి ప్రతి నెలా రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నారు. అలివేలు మంగ అనే దివ్యాంగురాలికి పింఛన్ తరహాలో ప్రతి నెలా రూ.1000 ఆర్థికసాయం అందిస్తున్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఆస్పత్రుల్లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. – తాడిపత్రిటౌన్ :
అభాగ్యులకు అండగా నిలవాలని..
Comments
Please login to add a commentAdd a comment