ఆర్డీటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
తాడిపత్రి టౌన్: ఆర్డీటీ ఆధ్వర్యంలో శుక్రవారం తాడిపత్రిలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి అశోక్ పిల్లర్ సర్కిల్ వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేసారు. విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో ఆర్డీటీ సీఓ ఆంజనేయులు చౌడేశ్వరి, విజయభాస్కర్, నల్లపరెడ్డి, పాఠశాలల ప్రిన్సిపాళ్లు అమర్నాథ్, శివప్రసాద్, పీఈటీ శివప్రసాద్, దాదాఖలందర్, అబ్రహం, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఐటీ కోర్‌టీం
విభాగానికి అవార్డు
అనంతపురం: పోలీసు శాఖకు అత్యంత ఉపయోగకరమైన క్రైం క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్‌వర్కింగ్ సిస్టం, ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం అప్లికేషన్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో జిల్లా ఐటీ కోర్‌టీం విభాగానికి అవార్డు దక్కింది. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఐటీ కోర్ టీం హెడ్ కానిస్టేబుల్ సుకుమార్ బాబుకు ఎస్పీ పి.జగదీష్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు అవార్డులు రాగా, ఒక అవార్డు అనంతపురం పోలీస్ టీంకు వచ్చింది. కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ వరకు ఒక కేటగిరీ, ఎస్‌ఐ ఆపై స్థాయి అధికారులకు మరో కేటగిరిలో అవార్డులు ప్రకటిస్తారు. ఐటీ కోర్ హెడ్‌కానిస్టేబుల్ సుకుమార్ బాబుకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును డీజీసీ కార్యాలయంలోని పీసీఎస్ విభాగానికి ఎన్‌సీఆర్‌బీ వారు పంపగా, అక్కడ నుంచి జిల్లాకు రావడంతో ఎస్పీ చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు.
10న అప్రెంటిషిప్ మేళా
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ బాలురు ఐటీఐలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ (పీఎంఎన్‌ఏఎం) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్, నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఎన్‌టీసీ పొందిన విద్యార్థులు అర్హులు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు 88868 85173లో సంప్రదించవచ్చు.
ఆర్డీటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment