బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌లో శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ప్రొబేషనరీ డీఎస్పీ అష్రప్ అలీ, ఎస్‌ఐ శివ, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళ రెండు చేతులపై ముగ్గుల బొమ్మల పచ్చబొట్లు ఉన్నాయి. ఎర్ర రంగు జాకెట్ ధరించి ఉంది. కొన్ని రోజులుగా నీటిలో మునిగి ఉండడంతో మృతదేహం పూర్తిగా ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా మారింది. పంచనామ అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మహిళ మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే బెళుగుప్ప పోలీసులను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment