
మహిళా సాధికారతకు ఉపాధ్యాయినులే నిర్దేశకులు
అనంతపురం ఎడ్యుకేషన్: మహిళా సాధికారతరకు ఉపాధ్యాయినులే దిశా నిర్దేశకులు అని సర్వశిక్ష అభియాన్ ఏపీసీ శైలజ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు గాయత్రి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ మహిళా సాధికారత ఎంతో అవసరమన్నారు. ఇందుకు పాఠశాల స్థాయిలోనే పునాది పడాలని సూచించారు. బుక్కరాయసముద్రం ఎంపీపీ సునీత మాట్లాడుతూ మహిళలు తమ అవకాశాలు, హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుజాత మాట్లాడుతూ మహిళలపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా చూపుతోందన్నారు. వివక్షత లేనటువంటి సమాజం నిర్మించాలన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి. నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎస్ సిరాజుద్దీన్, నాయకులు సర్దార్‌వలి, కే. వన్నప్ప, సతీష్ కుమార్, నరేష్ కుమార్, ఈజీ నాగభూషణం, నారాయణస్వామి సూర్యనారాయణ, పట్నం శ్రీనివాసులు, హరినాథ్, రామచంద్ర, తిప్పేస్వామి, సోహెల్ ఓబులేసు, సాయప్ప, ఎల్లప్ప, గంగాధర్, రామమూర్తి, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment