ఆవుట్ స్టాండింగ్ రైల్వే ఉమెన్ ఎంప్లాయీగా రజిత
గుంతకల్లు: తిరుపతి డిపోలో టీటీఐగా పని చేస్తున్న ఎం.రజిత దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆవుట్ స్టాండింగ్ రైల్వే ఉమెన్ ఎంప్లాయీగా అవార్డు అందుకున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. న్యూఢిల్లీలోని రైల్ నిలయం శనివారం రాత్రి రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ సెంటల్ర్ ఆర్గనేజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్‌కుమార్ ఆమెకు అవార్డు అందించారన్నారు. గతేడాది డిసెంబర్ 22న తిరుపతి–చిత్తూరు (12697) వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో ఏ2 కోచ్‌లో బెర్త్ నం.3లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు దాదాపు రూ.రెండు లక్షలు విలువ చేసే బ్రాస్లెట్‌ను పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న టీటీఐ రజితకు దొరికిన బ్రాస్లెట్‌ను చిత్తూరు జీఆర్‌పీ పోలీసుల ద్వారా ప్రయాణికుడికి అందజేశారు. ఆమెను డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా, ఏడీఆర్‌ఎం సుధాకర్ ప్రత్యేకంగా అభినందించినట్లు ఆయన తెలిపారు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
గుంతకల్లు: రైళ్లలో ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు తస్కరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు జీఆర్‌పీ సీఐ అజయ్‌కుమార్ తెలిపారు. శనివారం స్థానిక జీఆర్‌పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్‌పీఎఫ్‌లతో కలిసి రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేస్తుండంగా ఏడో నంబర్ ప్లాట్‌ఫారామ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో ఒకరిని గుంటూరులోని సోమిరెడ్డి బజార్‌కు చెందిన హర్షవర్ధన్‌రెడ్డిగా గుర్తించామన్నారు. ఇతను ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తూ నిద్రపోతున్న ప్రయాణికులు బ్యాగులు, విలువైన వస్తువులు తస్కరిస్తున్నట్లు తెలిపారు. హర్షవర్ధన్‌పై గుంతకల్లు, గుంటూరు, గుత్తి, ఆదోని, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయన్నారు. ఇతని వద్ద నుంచి సుమారు రూ.79 వేలు విలువ చేసే ఓ బంగారు డాలరుతోపాటు వెండి పట్టీలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించామన్నారు. జీఆర్‌పీ ఎస్‌ఐ మహేంద్ర, ఆర్‌పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment