మహిళా సాధికారతతోనే దేశ పురోగతి
సమానత్వంతోనే జాతి మనుగడ
అనంతపురం: మహిళా సాధికారతతోనే దేశ పురోగతి సాధ్యమని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శనివారం జేఎన్‌టీయూ(ఏ) ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, అసిస్టెంట్ కలెక్టర్ బి. వినూత్న, రాష్ట్ర ఎస్పీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, ప్రశాంతి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుశీలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.జిల్లాలో బాల్య వివాహాలు సమస్యగా తయారయ్యాయన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ బి. వినూత్న జిల్లాలో బాగా పనిచేశారని, న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసేందుకు వెళ్తున్నారని చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ తన భర్త ప్రోత్సాహంతోనే అందరి ముందు ఉన్నానని పేర్కొన్నారు.అనంతరం ఐసీడీఎస్, సెర్ప్, మెప్మా, పోలీసు, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ప్రశాంతి సమాఖ్య , సీ్త్రనిధి, పరిశ్రమల శాఖ పరిధిలో పీఎంఈజీపీ కింద ఎంఎస్‌ఎంఈ రుణాలు, పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా, ‘ముద్ర’, హ్యాండ్‌లూం, టెక్స్‌టైల్స్, మెప్మా పరిధిలో రుణాల చెక్‌లను మహిళలకు అందజేశారు.
అనంతపురం: జాతి మనుగడకు సీ్త్ర, పురుష సమానత్వం ముఖ్యమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి శ్రీనివాస్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం మహిళలకు ఉంటుందన్నారు. మహిళల ప్రాధాన్యతను వివరించారు. జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. మహిళలకు జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ కంటి ఆసుపత్రి, అక్బర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 300 మంది పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యవాణి, బార్ ప్రెసిడెంట్ గురుప్రసాద్,ఆలిండియా బార్ కౌన్సిల్ మెంబర్ ఆలూరి రామిరెడ్డి, మహిళా కోర్టు జడ్జి శోభారాణి, పోక్సో కోర్టు జడ్జి రాజ్యలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి నిర్మల, ఎకై ్సజ్ కోర్టు జడ్జి పావని పాల్గొన్నారు.
మహిళా సాధికారతతోనే దేశ పురోగతి
Comments
Please login to add a commentAdd a comment