ప్రభుత్వానికి సత్తా చూపుదాం
అనంతపురం కార్పొరేషన్: యువతతో పాటు అన్ని వర్గాలనూ దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ నెల 12న జరిగే ‘యువత పోరు’ కార్యక్రమం ద్వారా మన సత్తా ఏంటో చూపుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ ఈ నెల 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. ఆ రోజున విద్యార్థులు, యువతకు అండగా నిలిచేందుకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అనంతపురం జెడ్పీ కార్యాలయం నుంచి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, సూర్యనగర్ సర్కిల్, సంగమేశ్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్‌కు ర్యాలీ చేరుకుంటుందన్నారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందించి ప్రభుత్వానికి హెచ్చరిక చేయబోతున్నామన్నారు.జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఇటీవల బడ్జెట్‌లోనూ సరైన కేటాయింపులు చేయలేదన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారని, దీంతో ఎంతో మంది వైద్యులు, ఇంజినీర్లుగా ఎదిగారని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ‘వసతి దీవెన’ పథకం కింద హాస్టల్ ఖర్చులు అందజేశారని తెలిపారు.
రూ.4,500 కోట్ల బకాయిలు..
ఫీజు బకాయిలు విడుదల చేసే వరకూ సీఎం చంద్రబాబును వదిలేది లేదని ‘అనంత’ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద రూ.4,500 కోట్ల బకాయిలున్నాయని, వాటిని తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఈ విషయాలపై కనీసం బడ్జెట్‌లో కూడా ప్రస్తావించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే... కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైందన్నారు. అందరూ సంఘటితమై ఈ ప్రభుత్వ మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నేతలు రమేష్ గౌడ్, కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, సాకే చంద్రశేఖర్, చంద్రశేఖర్ యాదవ్, చింతకుంట మధు, చింతా సోమశేఖర్ రెడ్డి, కృష్ణవేణి, ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, గౌని నాగన్న, మల్లెమీద నరసింహులు, సైఫుల్లాబేగ్, అమర్‌నాథ్‌రెడ్డి, కేశవరెడ్డి, మిక్చర్ రామకృష్ణా రెడ్డి, లబ్బే రాఘవ, దత్తా, అనిల్‌కుమార్ గౌడ్, రాధాకృష్ణ, కై లాష్, శ్రీదేవి, శోభారాణి, దేవి, శోభాబాయి, పార్వతి, భారతి, కార్పొరేటర్లు ఇసాక్, సాకే చంద్రలేఖ, లావణ్య, సుమతి, ఉష తదితరులు పాల్గొన్నారు.
యువతకు అండగా నిలుద్దాం
ఫీజు బకాయిలు విడుదల చేసే వరకూ బాబును వదిలేది లేదు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment