బాబు తొలి సంతకంపైనే స్పష్టత లేదు
బీఎడ్ పూర్తి చేశా. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే డీఎస్సీ నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. కానీ, తొమ్మిది నెలలు కావస్తున్నా దీనిపై స్పష్టత లేకుండా పోయింది. నిరుద్యోగులను నట్టేట ముంచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నిరుద్యోగ భృతి మాటేమో కానీ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
– మహాలింగ, కై రేవు, శెట్టూరు మండలం
నిరుద్యోగ భృతి ప్రకటించాలి
కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అందిస్తామన్న భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. భృతి ఇస్తే ఎంతో తోడ్పాటు అందించినట్లు అవుతుంది. ప్రభుత్వ చేయూత లేక నిరుద్యోగులు గ్రామాల్లోనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి.
–రామాంజనేయులు, గార్లదిన్నె
న్యాయం చేయాలి
నేను డిగ్రీ చదివా. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నా. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పింది. లేకుంటే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీకి ఓటేశా. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతిపై ప్రకటన లేకుండా పోయింది. కనీసం బడ్జెట్‌లో కూడా పైసా కేటాయించలేదు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి.
– అశోక్‌కుమార్, కణేకల్లు
బాబు తొలి సంతకంపైనే స్పష్టత లేదు
బాబు తొలి సంతకంపైనే స్పష్టత లేదు
Comments
Please login to add a commentAdd a comment