హైస్కూళ్ల పరిధిలోకి 3, 4, 5 తరగతులు | 3rd to 5th classes within the scope of high schools Andhra Pradesh | Sakshi
Sakshi News home page

హైస్కూళ్ల పరిధిలోకి 3, 4, 5 తరగతులు

Published Fri, Oct 22 2021 4:53 AM | Last Updated on Fri, Oct 22 2021 4:53 AM

3rd to 5th classes within the scope of high schools Andhra Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ తరగతుల విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా వారికి ఉన్నత బోధనను అందించేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఒకే ఆవరణలో ఉన్న లేదా 250 మీటర్ల లోపు దూరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ల 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోకి తీసుకురావాలని ఆదేశించింది. అలాగే 1, 2 తరగతుల విద్యార్థులకు ప్రైమరీ ఎస్జీటీలతో బోధన కొనసాగించి, ఇతర సీనియర్‌ ఎస్జీటీలను 3, 4, 5 తరగతుల బోధనకు వీలుగా సర్దుబాటు చేయనుంది. ప్రాథమిక తరగతుల్లో టీచర్, విద్యార్థులను 1:20 నిష్పత్తిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement